కడుపులోపెట్టి పెంచి పోషించుకున్న,
కడుపే పొంగిపోయేలా పెరిగిపోతున్న,
ఒక్క క్షణానికి ప్రాణమనిపిస్తున్న,
మరొక్క నిమిషానికి కష్టమనిపిస్తున్న,
పేగు పాషమే కాలం
కాళ్ళని పాశాణం చేస్తున్న,
భావి భావమే
భారమైన బంగారమనిపిస్తున్న,
తీపి చేదుల విచిత్ర
రుచులనందిస్తున్న స్వర్గం....
ప్రేమ రంగులని నింపుకున్న
చిత్రం.....
కలలు కలిపి కలిసి రాసుకున్న,
కవిత్వం..... శ్రీకవీయం...
Monday, April 6, 2009
Subscribe to:
Post Comments (Atom)

superb... !!
ReplyDelete